ఒక్క రోజు హెడ్ లైన్ కోసం రేవంత్ రెడ్డి కష్టాలు..!

Revanth Reddy struggles for one day headline..!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్క రోజు హెడ్ లైన్ కోసం పడరాని పాట్లు పడుతున్నారా..?. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీ నిత్యం రోజూ ఇటు మీడియా అటు పీపుల్స్ అటెన్షన్ ను హామీల నుండి మళ్లించడానికి రోజుకో వివాదాన్ని లేపుతుందా..?. అంటే గత ఏడాదిన్నరగా జరుగుతున్న చర్చ ను పరిశీలిస్తే అందరికీ ఆర్ధమవుతుంది. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మీడియాలో ఆ పార్టీ నేతలు ప్రెస్మీట్ పెట్టి తెగ ఉకదంపుడు ప్రసంగాలు ఇచ్చారు.
దాదాపు పద్నాలుగు నెలలవుతున్నా దాని గురించి అతి లేదు . గతి లేదు. ఆ తర్వాత కరెంటు కోనుగోళ్ల విషయంలో అవినీతి అన్నారు. ఆ తర్వాత మిషన్ భగీరథలో అన్నారు. ఆ తర్వాత ఈ కారు రేసులో జరిగిందన్నారు. అంతకుముందు ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నారు. కేసులో అయితే ఆ కల్వకుంట్ల కుటుంబాన్ని ఎవరూ రక్షించలేరని కూడా అన్నారు. ఇవన్నీ ఆరోపణలే తప్పా ఒక్కటి నిజం లేదు. తాజాగా ఓ పుస్తకావిష్కరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మాట్లాడుతూ తెలంగాణ సమాజంలో జీవించే హాక్కు లేదని సంచలనారోపణలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” సీఎం అయిన కానీ తన బుద్ధి మారలేదు. ఎలుక తోలు తెచ్చి ఎన్నాళ్లు ఉతికిన నలుపు నలుపే కానీ తెలుపవుతుందా అని ప్రశ్నించారు. కేసీఆర్ కు తెలంగాణ సమాజంలో జీవించే హాక్కు లేదని అంటున్న రేవంత్ రెడ్డికి అసలు ఉందా ..?. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఫెయిల్ అయ్యారు.
దాని నుండి తెలంగాణ ప్రజల దృష్టి మళ్లించడానికి రోజుకో వివాదాన్ని ముందరేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వల్ల ఒక్కరోజు పేపర్ లో.. మీడియాలో హెడ్ లైన్ అవుతాడు తప్పా ఒరిగేది ఏమి లేదు. కొడంగల్ నియోజకవర్గానికి వస్తావా రేవంత్ రెడ్డి. ఎవరికి తెలంగాణ సమాజంలో జీవించే హాక్కు లేదో తేలుస్తారు. మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి. రాహుల్ గాంధీ మెప్పు కోసమే రేవంత్ రెడ్డి అవాక్కులు .. చవాక్కులు అని ఆయన అన్నారు.
