డిపెన్స్ లోకి సీఎం రేవంత్ రెడ్డి..?
తెలంగాణ ముఖ్యమంత్రి ఏడాది పాలన ముగిసింది. ఏడాది పాలనలో పూర్తి దూకుడుగా కనిపించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతిపక్షమే టార్గెట్ గా అరెస్ట్ లు,కేసులతో ఏడాది పాలన సాగింది. దూకుడు స్వభావంతో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వాడకూడని భాషను సైతం గత ఏడాది కాలంలో ప్రయోగించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం చేపట్టి హైడ్రా,లగచర్ల భూసేకరణ,రైతులను జైల్లో పెట్టడం,ఏక్ పోలీస్ ఏక్ విధానం కోసం కోట్లాడిన కానిస్టేబుల్స్ కుటుంబసభ్యులను సైతం నడిరోడ్డుపైకి లాగడం లాంటి విషయాల్లో తీవ్ర అసంతృప్తిని మూటగట్టుకున్నారు. ఏడాది చివర్లో పార్ములా – ఈ రేసింగ్ గేమ్ లో మాజీ మంత్రి కేటీఆర్ విదేశి సంస్థలకు డబ్బులు పంపాడని నేరం మోపి అరెస్ట్ అంటూ చర్చకు తెరలేపి ఏకంగా ఏసీబీ,ఈడీనే రంగంలోకి దించారు. కేటీఆర్ ను జైల్లో పెట్టడనే లక్ష్యంగా పావులు కదిపారు.
అయితే నిన్న ఏసీబీ విచారణకు హాజరైన మాజీమంత్రి కేటీఆర్ వెళ్తూనే గాంబీర్యంగా వెళ్లారు.రోజంతా విచారణ జరిపినా అందులో ఏం అవకతవకలు జరిగినట్టు తేలకపోవటంతో అంతే గాంభీర్యంగా ఆయన బయటకు వచ్చారు.మాజీమంత్రి కేటీఆర్ అరెస్ట్,ఐపోయింది అంతా అని బీరాలు పలికిన కాంగ్రెస్ అండ్ కో బ్యాచ్ కి నోట్లో వెలక్కాయ పడ్డట్లైంది.. ఇదంతా చూస్తున్న రేవంత్ రెడ్డి డిపెన్స్ లో పడ్డట్టు కనబడుతుంది.గతంలోలా దూకుడు ప్రదర్శించలేకపోతున్నారు.
ప్రెస్ ముందుకు సైతం సరిగ్గా కనపడటం లేదు.ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రజల్లో వచ్చిన వ్యతిరేఖత,సొంత పార్టీలోనే రేవంత్ రెడ్డి దుందుడుకు చర్యలపై పుడుతున్న ముసలం,అధిష్టానం సైతం రేవంత్ దూకుడుకు కల్లెం వేయడం,జైలుకెలతాడనుకున్న కేటీఆర్ దర్జాగా గల్లా ఎగరేయటం,ప్రతిపక్షానికి ప్రజల్లో ఆదరణ పెరుగుతుండటం వెరసి రేవంత్ రెడ్డి ని డిపెన్స్ లోకి నెట్టాయని తెలుస్తుంది.ఒకానొక దశలో రేవంత్ పదవికి ఎసరు వచ్చినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.