రేవంత్ రెడ్డి.. దమ్ముంటే ఆశోక్ నగర్ కు రా…?

Revant government’s big shock for Asara beneficiaries..!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీకు దమ్ముంటే ఆశోక్ నగర్ కు రావాలని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు సవాల్ విసిరారు.
సిద్ధిపేట జిల్లాలో ఆదివారం పర్యటించిన మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన జీవో 29 నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతుంది.
ఈ జీవో వల్ల ఎక్కువగా నష్టపోయేది ఎస్సీ ,ఎస్టీ ,బీసీ వర్గాల యువతనే.. తాము తీసుకోచ్చిన జీవో యువతకు అంత లాభదాయకం అయితే ఆశోక్ నగర్ కు సెక్యూరిటీ లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావాలి. వాళ్లతో మాట్లాడాలి..వాళ్లకు భరోసానివ్వాలని ఆయన సవాల్ విసిరారు.
