హరీశ్ రావు ఎంట్రీ – రేవంత్ లో గుబులు..
బీఆర్ఎస్ పార్టీలో హరీశ్ రావు ఓ ఫైర్ బ్రాండ్..ఎలాంటి పరిస్థితులనైనా ఈజీగా హ్యాండిల్ చేయగల నేర్పరి హరీశ్ రావు.మేనమామ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర రాజకీయ ఓనమాలు నేర్చుకుని గురువు వ్యూహాలను అమలు చేస్తూ,మామకు తగ్గ అల్లుడిగా పేరు తెచ్చుకున్నారు.బీఆర్ఎస్ పార్టీలో ఏ కార్యకర్తకు ఆపదచ్చినా టక్కున గుర్తచ్చే పేరు హరీశ్ రావు.అభిమానులకు అండగా నిలవటమే కాకుండా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తారనే పేరుంది.అసెంబ్లీలో అధికారపక్షానికి ముచ్చెమటలు పట్టిస్తూ అసెంబ్లీ టైగర్ గా పేరు తెచ్చుకున్నారు.బీఆర్ఎస్ పార్టీకి అడనొక ట్రబుల్ షూటర్ అని చెప్పవచ్చు..
ఇదంతా అటుంచితే నిన్న బీఆర్ఎస్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఒకే వేదికపై కేటీఆర్,హరీశ్ రావు ప్రత్యక్షమవటం.సమావేశంలో హరీశ్ రావు ఇచ్చిన ప్రసంగం కార్యకర్తల్లో మంచి జోష్ ను నింపిందనే చెప్పవచ్చు.కేటీఆర్,హరీశ్ రావు మద్య విబేదాలున్నాయంటూ కాంగ్రేస్,బీజేపీలు నిత్యం ఆరోపణలు చేస్తుంటాయి.కొన్ని వ్యతిరేఖ పత్రికలు,యూట్యూబ్ ఛానెల్స్ సైతం హరీశ్,కేటీఆర్ మద్య దూరం ఉందనే వదంతులు లేపాయి.దీంతో క్యాడర్ కూడా కాస్త గందరగోలానికి గురయ్యారు.అయితే నిన్న తెలంగాణ భవన్ లో హరీశ్ రావు ప్రసంగిస్తూ కేటీఆర్ కు పార్టీ,మనందరం అండగా ఉండాలి అంటూ కేటీఆర్ చేసిన కృషిని పొగడటంతో ప్రసంగం ఉద్వేగపూరితంగా సాగింది.కార్యకర్తలు సైతం ఫుల్ జోష్ గా ఫీల్ అయ్యారు..
ఒక్కసారిగా హరీశ్ కేటీఆర్ లు ఇలాంటి ఫైర్ ప్రసంగాలు ఇవ్వటం.ప్రజల్లో కార్యకర్తల్లో వీరిపై పాజిటివ్ చర్చ ఉండటం రేవంత్ రెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్టు తెలుస్తుంది.బావ బావమరుదులను విడగట్టి పబ్బంగడుపుకోవాలని చూస్తే,వారు మరింత బలంగా ఏకమై తమపై దండయాత్ర ప్రకటించారని రేవంత్ రెడ్డి భయపడుతున్నట్టు తెలుస్తుంది.హరీశ్ రావు,కేటీఆర్ లు క్లాస్ మాస్ కలగలసిన నాయకులు,ఉద్యమ నేపద్యం,కేసీఆర్ నాయకత్వంలో రాటుదేలారు.ప్రత్యర్థులు నేరుగా విమర్శించినా,వెనక మాత్రం వాళ్ళ నాయకత్వపటిమను పొగడక మానరు.అలాంటి వారు ఒక్కచోట చేరి పనిచేస్తే వారిని ఎదుర్కోవటం కష్టమనే అభద్రతాభావంలో ముఖ్యమంత్రి పడినట్టు తెలుస్తుంది.కేటీఆర్ అరెస్ట్ ఇష్యూలో హరీశ్ రావు ఎంట్రీ ముఖ్యమంత్రికి నిద్రలేకుండా చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.