రేవంత్ ది అంతా 20:20 కమీషన్ల పాలన..?

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పరిపాలనా దక్షత లేదు.తెలంగాణకు రేవంత్ గ్రహణంలా పట్టారు అని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అన్నరు. వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్న మాజీ మంత్రి హారీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పాలన అంతా 20:20 కమీషన్ పాలనలాగ నడుస్తుంది.
తమకు పాలన చేతకాక ప్రతిపక్షాలపై నిందలు వేస్తున్నారు. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. పదేండ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ ప్రతి చుక్కను ఒడిసిపట్టారు.
కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను నిర్మించారు.పదేళ్లలో ఎప్పుడూ కరువు రాలేదు. పదిహేను నెలలవుతున్న కనీసం చెరువు కూడా బాగుచేయలేదు రేవంత్ రెడ్డి .నీకు చేతకాక నీరంతా సముద్రం పాలు చేశావు అని హరీష్ రావు రేవంత్ పై విరుచుకుపడ్డారు..
