కొడంగల్ సాక్షిగా నోరు జారిన సీఎం రేవంత్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ..టీపీసీసీ అధినేత అనుముల రేవంత్ రెడ్డి కొడంగల్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ నేతలు.. కార్యకర్తల సమావేశం సాక్షిగా నోరు జారారు. ఆయన పార్లమెంట్ ఎన్నికలను ఉద్ధేశించి మాట్లాడుతూ” రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఓటును లెక్కగట్టి మన పార్టీ అభ్యర్థికి వేయించాలని సీఎం హోదాలో ఉండి మరి ప్రజలను ఓటర్లను ప్రలోభం చేస్తూ దొంగ ఓట్లను వేయించాలని పిలుపు ఇచ్చినట్లు ఆర్ధం వచ్చేలా మాట్లాడారు.
ఆయన ఏమన్నారంటే”కొడంగల్ పాలమూరుకు చెందిన ఓటర్లు పక్కన ఉన్న హైదరాబాద్‌లో ఉన్నారా..? లేదా కూతవేటు దూరంలో ఉన్న తాండూరులో ఉన్నాడా..? అని చెప్పి ప్రతి ఓటు లెక్కకట్టి చూసుకోవాలి. వాళ్లకు పోలింగ్ తేదితో సహా ఓటు వేసే విధంగా సమాచారం పంపాలి. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో వేర్వేరు తేదీల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి.
కానీ మనకు మే 13న ఎన్నికలు ఉంటే.. మహారాష్ట్రన ఇంకో తారీఖు నాడు ఎన్నికలు ఉన్నాయి. కర్ణాటకలో ఏప్రిల్ 6న ఎన్నికలు ఉన్నాయి. మన చుట్టాలు కానీ, మనోడు కానీ కర్ణాటకలో ఉంటే అక్కడ ఎన్నికలు చూసుకోని, మళ్లా ఇక్కడ ఎన్నికలకు రావొచ్చు. మీరు అన్ని రకాలుగా ఓట్లను చేజారనివ్వకుండా కాపాడుకోవాలని పార్టీ శ్రేణులకు.. ప్రజలకుసీఎం రేవంత్ సూచించారు.