రాజీనామాలు నాకు కొత్త కాదు. రికార్డులు నాపేరుపై ఉంటాయి.
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి రాజీనామా చేయమని నాకు సవాల్ విసురుతున్నారు. నాకు రాజీనామాలు కొత్త కాదు. నేను పదవులకు రాజీనామా చేసిన నిలబడిన ప్రతిసారి రికార్డు మెజార్టీతో ప్రజాక్షేత్రంలో గెలుస్తున్నాను. ప్రజలు మేము చేసిన పోరాటాలకు.. చేసిన సంక్షేమాభివృద్ధికి పట్టం కడుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చమంటే మమ్మల్ని రాజీనామాలు చేయమని అంటున్నారు.
నాడు తెలంగాణ కోసం పదవులకు రాజీనామాలు చేసిన చరిత్ర మాది. పదవులను అంటిపెట్టుకుని ఉన్న చరిత్ర మీది. గత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసేదాక.. నాలుగోందల ఇరవై హామీలను నెరవేర్చేదాక ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అన్నారు. ఈరోజు బుధవారం పాలమూరులోని కురుమూర్తి జాతరలో పాల్గోన్నారు.
అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ కేసీఆర్ అడ్రస్ లేకుండా చేస్తానడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవగాహనరాహిత్యానికి నిదర్శనం. కేసీఆర్ అంటే చరిత్ర.. కేసీఆర్ అంటే తెలంగాణ. కేసీఆర్ అంటే కాళేశ్వరం. కేసీఆర్ అంటే సచివాలయం. కేసీఆర్ అంటే రైతుబంధు. కేసీఆర్ అంటే రైతు బీమా .. వీటన్నింటిని లేకుండా చేస్తారా అని ఆయన ప్రశ్నించారు.