తెలంగాణలో కూడా రెడ్ బుక్..?
ఆదిలాబాద్ లో జరిగిన రైతు ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ పది నెలల కాంగ్రెస్ పాలనలో అన్ని డైవర్శన్ పాలిటిక్స్ చేస్తున్నారు. హామీల అమలు గురించి ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు.. సోషల్ మీడియా దగ్గర నుండి క్షేత్రస్థాయిలోని కార్యకర్తల వరకు అందరిపై అక్రమ కేసులు పెడుతున్నారు. ఉద్యమం సమయంలోనే కొట్లాడినోళ్లం.. మాకు కేసులు కొత్త కాదు.. జైళ్లు కొత్త కాదు.
ప్రభుత్వాధికారులకు, పోలీసు తమ్ముళ్లకు ఒకటే విన్నపం చేస్తున్నాను. మీరు న్యాయబద్ధంగా నడుచుకోండి. ఎవరో మంత్రో. కంత్రో కాల్ చేసిండని చట్టానికి విరుద్ధంగా వ్యవహరించకండి. కాంగ్రెస్ ప్రభుత్వం కలకాలం ఉండదు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. మా జోగి రామన్నకు చెప్పాను. ఎవరైతే చట్టానికి విరుద్దంగా నియమాలను తుంగలో తొక్కి వ్యవహరిస్తారో వారందరి పేర్లు రాయమని చెప్పాను.
మేము అధికారంలోకి వచ్చాక వాడు ఎస్పీ అయిన ఎస్సై అయిన సీఐ అయిన అఖరికి కలెక్టర్ అయిన ఎవర్ని వదిలిపెట్టేది లేదు.. వడ్దీతో సహా మిత్తి చెల్లిస్తామని వార్నింగ్ ఇచ్చారు. గతంలో ఏపీలో వైసీపీ పాలనలో జరుగుతున్న విధానాలపై ప్రస్తుత మంత్రి లోకేష్ మేము రెడ్ బుక్ రాస్తున్నామని అప్పట్లో వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే.