మల్కాజ్ గిరిలో గులాబీ జెండా ఎగరాలి
కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు 125 – గాజుల రామారం డివిజన్ ఆక్సిజన్ పార్కులో వాకర్స్ తో ముచ్చటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు, ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ గత పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి గెలిచిన రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి చేసింది ఏమి లేదని, కనీసం ప్రతి ఒక్కరోజు ఈ ప్రాంతాల్లో తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకోలేదన్నారు. అదే మన అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు నిత్యం ప్రజల్లో ఉంటూ ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని ప్రజా సంక్షేమం కోసం పనిచేసే రాగిడి లక్ష్మారెడ్డి లాంటి వ్యక్తిని భారీ మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గంలో పాటు మన ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.
కావున రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి అయిన రాగి లక్ష్మారెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రావుల శేషగిరి, డివిజన్ అధ్యక్షులు విజయరామ్ రెడ్డి, పాక్స్ డైరెక్టర్ పరిశె శ్రీనివాస్ యాదవ్, సీనియర్ నాయకులు కస్తూరి బాల్ రాజ్, అడ్వకేట్ కమలాకర్, రషీద్ బెగ్, మహేష్, నవీన్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.