రేవంత్ రెడ్డి కాదు డైవర్శన్ రెడ్డి-మాజీ మంత్రి హారీష్

 రేవంత్ రెడ్డి కాదు డైవర్శన్ రెడ్డి-మాజీ మంత్రి హారీష్

బ్లాక్‌మెయిల్ రాజకీయాలతోని, అక్రమ కేసులతో, అరెస్టులతో తన ప్రభుత్వం యొక్క తప్పిదాలను కప్పిపుచ్చుకోని.. మమ్మల్ని మానసికంగా బలహీన పరుస్తున్నాను అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు.కాని మేము మరింత బలంగా పోరాడుతాము తప్ప.. నీ అక్రమాల పై, ఆరు గ్యారంటీల అమలు పై ప్రశ్నించడం మాత్రం ఆపము అని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు.

హైకోర్టు మాజీ మంత్రి కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను కొట్టివేసిన నేపథ్యంలో నందినగర్ కేటీఆర్ నివాసం దగ్గర మాజీ మంత్రి హారీష్ రావు మీడియాతో మాట్లాడుతూ “రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.. రేవంత్ ప్రభుత్వం కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కేటీఆర్ గారిపై ఈ అక్రమ కేసు నమోదు చేసింది.వానాకాలం రైతుబంధు ఎగ్గొట్టి, యాసంగిలో కూడా ఎకరాకు 15 వేలు ఇస్తామని చెప్పి, 6 వేలు మాత్రమే ఇస్తాననడంతో ప్రజల్లో ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నది.ఏడాది పాలన తర్వాత కూడా ఈ ముఖ్యమంత్రి ఫెయిల్యూర్ సీఎం అని ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని అన్ని సర్వే రిపోర్టుల్లో తెలియవస్తున్నది.

దీంతో అక్రమ కేసు పెట్టి ప్రజల్ని డైవర్ట్ చేసేందుకు సీఎం రేవంత్ ప్రయత్నిస్తున్నాడు. సీఎం రేవంత్ మాలాంటి నాయకులపై కూడా ఇలాంటి అక్రమ కేసులెన్నో పెడతాడు. ఎన్ని కేసులు పెట్టినా, బీఆర్ఎస్ పోరాటం ఆగదు, ఆ కేసులను ఎదుర్కోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం. మాకు తెలంగాణ ప్రజలు ముఖ్యం, ఈ రాష్ట్రం ముఖ్యం. ఎన్నో పోరాటాలతో, త్యాగాలతో తెలంగాణ తెచ్చుకున్నం. తెలంగాణ అభివృద్ధి చెందడం, ప్రజల సంక్షేమం బీఆర్ఎస్ లక్ష్యం. మీరు మా మీద ఎన్ని కేసులు పెట్టినా, మేం ప్రశ్నిస్తూనే ఉంటామని తెలిపారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *