Cancel Preloader

అత్యవసర పనులుంటే తప్ప ఎవరూ బయటకు రావొద్దు

 అత్యవసర పనులుంటే తప్ప ఎవరూ బయటకు రావొద్దు

Telangana CM Revanth Reddy

తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , దామోదర రాజనర్సింహ , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , తుమ్మల నాగేశ్వరరావు , జూపల్లి కృష్ణారావు , ఉన్నతస్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని అత్యవసరంగా సమీక్షించారు. ప్రధాన కార్యదర్శి, డీజీపీ, మున్సిపల్, విద్యుత్, పంచాయతీ రాజ్, హైడ్రా, ఇరిగేషన్ అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని టెలి కాన్ఫరెన్స్ లో సీఎం ఆదేశించారు.

అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు 24 గంటలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ సమయంలో అధికారులెవరూ సెలవులు పెట్టొద్దని, ఇప్పటికే సెలవుపై ఉన్నవారు వెంటనే విధుల్లో చేరి సహాయక పనుల్లో నిమగ్నం కావాలని ఆదేశించారు.అత్యవసర విభాగాల అధికారులు క్షేత్ర స్థాయిలోనే ఉండాలని, ఎప్పటికప్పుడు సమాచారాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపాలని సీఎం చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టాలన్నారు.

అత్యవసర పనులుంటే తప్ప ఎవరూ బయటకు రావొద్దని ప్రజలందరికీ ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి అవసరం ఉన్నా అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలని సూచించారు.మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థానికంగా ఉంటూ సహాయక కార్యక్రమాలు చేపట్టాలని, 24 గంటలు అలెర్ట్ గా ఉంటూ సహాయ కార్యక్రమాల్లో భాగం కావాలని పార్టీ కార్యకర్తలనూ ముఖ్యమంత్రి ఆదేశించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *