ఎమ్మెల్సీ కవిత సంచలన వాఖ్యలు..?

 ఎమ్మెల్సీ కవిత సంచలన వాఖ్యలు..?

Kavitha mass warning to Revanth Reddy..!

Loading

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వాఖ్యలు చేసారు..వరంగల్ వచ్చే ధైర్యం లేక రాహుల్ గాంధీ పారిపోయారని అన్నారు.హామీలపై ప్రజలు నిలదీస్తారనే రాహుల్ గాంధీ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారు.

అదే వరంగల్ లో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ అమలే కాలేదన్నారు..వరంగల్ డిక్లరేషన్ పై రైతులు ప్రశ్నిస్తారని రాహుల్ గాంధీ భయపడ్డారు.ఇచ్చిన మాట తప్పితే ప్రజలు ఊరుకోబోరన్నారు.మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు ఎక్కడా తిరగలేని పరిస్థితి ఏర్పడుతుంది.ఇక్కడి కాంగ్రెస్ నాయకులను ప్రజలు నమ్మడం లేదని ఎన్నికలప్పుడు ఢిల్లీ నుంచి నాయకులను తీసుకొచ్చారన్నారు..

సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీ వచ్చి చిలుక పలుకులు పలికారు.రేవంత్ రెడ్డి ముఖం కాదు,సోనియా, ప్రియాంకా, రాహుల్ గాంధీల ముఖం చూసి మహిళలు కొంత వరకు ఓట్లు వేశారు.అధికారంలోకి వచ్చి 14 నెలలు అయినా మహిళలకు 2500 ఇవ్వడం లేదు.

రేవంత్ రెడ్డి మహిళలకు రూ 35 వేల చొప్పున బాకీ పడ్డారన్నారు..రూ. 35 వేలను ప్రతీ మహిళా బ్యాంకు ఖాతాలో జమా చేయాలి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మార్చి 8న మహిళా శంఖారావం..రాష్ట్రంలో మహిళలకు భద్రత లేని పరిస్థితి రేవంత్ రెడ్డి పాలనలో క్రైమ్ రేటు పెరిగిందన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *