మంత్రి పొంగులేటి మరోసారి సంచలన వ్యాఖ్యలు
ఉమ్మడి వరంగల్ జిల్లా తొర్రూరు మార్కెట్ కమిటీ పాలకవర్గం బాధ్యతల స్వీకరమహోత్సవానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ” గత ప్రభుత్వం రైతులను మోసం చేసింది. వ్యవసాయరంగాన్ని చిన్నాభిన్నం చేసింది. తాము గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేశాము..
ఇంకా పదమూడు వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయాల్సి ఉంది. డిసెంబర్ తొమ్మిదో తారీఖు లోపు ఇవి కూడా చేసేస్తాము. ఇప్పటి వరకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేశాము అని ఆయన అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ ” ఫార్ములా ఈ రేసింగ్ లో అవినీతి అక్రమాలు జరిగాయి. దాదాపు యాబై ఐదు కోట్ల రూపాయలు దారి మళ్లాయి.
అవి ఎవరి చేతిలోకి వెళ్లాయో మాదగ్గర లెక్క లున్నాయి.. నాటు బాంబులు కాదు.. లక్ష్మీ బాంబులు కాదు. పెద్ద అటం బాంబు రెడీగా ఉన్నదని సంచలన వ్యాఖ్యలు చేశారు. దొంగ ఎవరంటే మాజీ మంత్రి కేటీఆర్ ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు అని ప్రశ్నించారు. అవినీతి అక్రమాలకు పాల్పడిన ఏ ఒక్క బీఆర్ఎస్ నాయకుడ్ని వదిలిపెట్టబోము అని ఆయన అన్నారు.