KTR,HARISH RAO లకు మంత్రి పొంగులేటి కౌంటర్
- Breaking News Slider Telangana Top News Of Today
singidinews
- August 24, 2024
- 0
- 1 minute read

Minister Ponguleti Srinivasa Reddy
తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ మరియు ఐఎన్ పీఆర్ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,ఎమ్మెల్యే,V6 ఆధినేత వివేక్, మాజీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, మధుయాష్కి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిల ఫామ్ హౌజ్ లు బఫర్ జోన్లో…FTL పరిధిలో ఉన్నాయి అని మాజీ మంత్రులు కేటీ రామారావు,తన్నీరు హారీష్ రావు ఆరోపించిన సంగతి తెల్సిందే..
తనపై మాజీ మంత్రులు కేటీఆర్,హారీష్ రావు చేసిన ఆరోపణలపై నిన్న శుక్రవారం గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు.. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆరుడేళ్లు మున్సిపల్ మంత్రిగా కేటీఆర్,ఇరిగేషన్ మంత్రిగా హారీష్ రావు పని చేశారు..వారిద్దరికీ ఒకటే మనవి చేస్తున్నాను..
నా నివాసం ఇటు బఫర్ జోన్ లో ఉన్నా..అటు FTL పరిధిలో ఉన్న కానీ ఆ ట్యూబ్ ఈ ట్యూబ్ ఛానెళ్లను తీసుకోని వెళ్లండి.. అది నిజమైతే ఈ వేదిక నుండి హైడ్రా కమీషనర్ రంగనాథ్ గార్కి ఆదేశాలను జారీ చేస్తున్నాను.. వెంటనే ఆ నివాసాన్ని కూల్చివేయమని ఆదేశిస్తున్నాను అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాజీ మంత్రులు కేటీఆర్,హారీష్ రావులకు కౌంటరిచ్చారు..