బాలానగర్ లో మంత్రి దామోదర పర్యటన
తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని వై కిషన్ రావు బాలనగర్ లయన్స్ కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో 2 కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
గత 40 సంవత్సరాలుగా నిర్విరామంగా సేవా భావంతో సామాన్య ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తున్న వై కిషన్ రావు బాలానగర్ లయన్స్ క్లబ్ కంటి హాస్పటల్ నిర్వాహకులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో హాస్పిటల్ చైర్మన్ వై. నవీన్ రావు, మాధవరెడ్డి వైస్ చైర్మన్, కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్, స్థానిక కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి, కార్యదర్శి త్రిభువన్, కోశాధికారి శ్రీనివాసరావు, ట్రస్టీ ఆర్కే రాజు, నాగేశ్వరరావు, ఆర్కిటెక్ రమేష్, స్థానిక నాయకులు శివకుమార్ గౌడ్, సదానంద్ గౌడ్ లు పాల్గొన్నారు.