కేటీఆర్ వల్ల గురుకులాలకు తాళాలు

KTR stands by the child..!
3 total views , 1 views today
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అద్దె భవనాల్లో ఉన్న గురుకులాలకు తాళాలు వేస్తున్నారు అని మంత్రి దనసూరి అనసూయ ఆలియాస్ సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు.
మీడియాతో ఆమె మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పాలనలో అద్దె భవనాలకు అద్దెలు చెల్లించకుండా మూడు ఏండ్లు కాలయాపన చేసింది. అందుకే అద్దె భవనాల యాజమానులు ఆయా భవనాలకు తాళాలు వేస్తున్నారు. తమ ప్రభుత్వం ఏర్పడి పది నెలలే అవుతుంది.
పది నెలల్లో అన్ని అవుతాయా..? అని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్ ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి వెళ్లారు. మేము ఆ అప్పులు కడుతూ ప్రజాసంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము అని అన్నారు. అద్దె భవనాలకు తాళాలు పడుతుంటే బీఆర్ఎస్సోళ్ళు ఆనంద పడుతున్నారు అని ఆమె హెద్దేవా చేశారు.
