కేటీఆర్ ధర్నాలు.. రాస్తోరోకులు అందుకేనా..?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని షాబాద్ లో జరిగిన రైతు మహా ధర్నాలో పాల్గోన్న సంగతి తెల్సిందే. ఈ మహాధర్నాలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ “జనవరి 26 నుంచి రైతు బంధు రూ. 15000 ఇవ్వాలి. మొత్తం 22 లక్షల మంది కౌలు రైతులకు కూడా రైతుబంధు ఇవ్వాలి.
అధికారంలోకి రాకముందు మూడు పంటలకు రైతుబంధు ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ పని చేసి చూపించాలి.ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలి. వాటిని అమలు చేసే వరకు రైతుల పక్షాన, వృద్ధుల పక్షాన, మహిళల పక్షాన, రేవంత్ ప్రభుత్వాన్ని వెంటాడుతామని వార్నింగ్ ఇచ్చిన సంగతి తెల్సిందే.
కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ ” పదేండ్లలో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చలేదు.ఇప్పుడు ధర్నాలు చేస్తుంది. అవినీతి అక్రమ కేసుల నుండి తప్పించుకోవడానికే కేటీఆర్ ధర్నాలు.. రాస్తోరోకులు డ్రామాలు ఆడుతున్నారు. బీఆర్ఎస్ సృష్టించిన ఆర్థిక విధ్వంసం మూలంగా కొన్ని పథకాలను అమలు చేయలేకపోతున్నామని అన్నారు.