వీడు ఎక్కడున్నాడంటూ రేవంత్ పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు…?
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసలు తగ్గేదేలే అంటున్నారు. ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” కేసీఆర్ లాంటి వ్యక్తిని తిడితే సీఎం ను సైతం తిడతానని ఆయన స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి పై నోరు పారేసుకుంటారనే విమర్శలపై సదరు న్యూస్ ఛానెల్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా సమాధానమిచ్చారు. మాజీ మంత్రి కేటీఆర్ ఇంకా మాట్లాడుతూ ” తెలంగాణ పితామహుడి లాంటి కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఇష్టమోచ్చినట్లు మాట్లాడోచ్చు..
మేము మాత్రం గమ్మున ఉండాల్నా… అలా మాట్లాడితే సీఎం ను చెత్త వెధవ,బేకార్ గాడు ,చిట్టి నాయుడు అంటాను.. వెనక్కి తగ్గను. కేసీఆర్ వయసు ఎంత..?. ఆయన వయసు ఎంత..?. అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ కోసం కేసీఆర్ కోట్లాడుతున్నప్పుడు వీడు ఎక్కడున్నాడని ఘాటుగా స్పందించారు.