కేటీఆర్.. ముసుగులో గుద్దులాటలెందుకూ…!

KTR
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదంలో బీజేపీ కి చెందిన ఓఎంపీ హాస్తం ఉందని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బాంబు పేల్చిన సంగతి తెల్సిందే.
మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ డీకే అరుణ స్పందించారు. విజయవాడ పర్యటనలో ఉన్న ఎంపీ అరుణ మాట్లాడుతూ కేటీఆర్.. ముసుగులో గుద్దులాటలు ఎందుకు.. నీకు దమ్ముంటే ఆ ఎంపీ పేరు చెప్పాలి.
అంతేకానీ గాల్లో మేడల్లా మాటలు ఎందుకు అని ఆమె సవాల్ విసిరారు. ఎంపీ అరుణ ఇంకా మాట్లాడుతూ దక్షిణాదిలో ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ బలపడుతుంది. ఎంపీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో గెలిచాము. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో గెలిచామని అన్నారు.