3 నెలలు కాదు 3 ఏండ్లు అంటున్న కేటీఆర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ పై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ మూడు నెలలు కాదు.. మూడు ఏండ్లు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉంటాను.
నేను గతంలో మూసీ నింబొలి అడ్డాలోనే ఉన్నాను అని తెలిపారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు మూటలు పంపాలి. అందుకే రేవంత్ రెడ్డి హైడ్రా, మూసీ నది సుందరీకరణ అని ముందరేసుకున్నాడు.
అవసరమైతే చందాలు వేసుకోని మరి రేవంత్ రెడ్డికి ఇస్తాము.. పేద ప్రజల జీవితాలతో ఆడుకోవద్దు. వాళ్లను నడిరోడ్లపైకి లాగోద్దని మాజీ మంత్రి కేటీఆర్ హితవు పలికారు.