నేడు కేటీఆర్ మీడియా కాన్ఫరెన్స్
తెలంగాణ రాజధాని మహానగరం హైదరాబాద్ లో మూసీ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ సర్కార్ ప్రత్యేకించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో అర్థరహితమైన వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ భగ్గుమంటుంది.
మూసీనది ప్రక్షాళన కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో చేపట్టిన కార్యక్రమాలు, ఫలితంగా మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజలకు కలిగిన ప్రయోజనాలు, మూసీ ప్రాజెక్టు కోసం వేసిన అడుగులు మొదలైన అంశాలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.