రేవంత్ రెడ్డికి కేటీఆర్ మాస్ కౌంటర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ మాస్ కౌంటర్ ఇచ్చారు.. కేంద్ర సర్కారు వివక్షపై చేయనున్న అసెంబ్లీ తీర్మానంపై జరుగుతున్న చర్చలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి గారు తెలంగాణ పట్ల కేంద్ర సర్కారు చూపుతున్న వివక్షపై అసెంబ్లీ తీర్మానం చేయాలనుకోవడం మంచి నిర్ణయం..
కానీ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఈ తీర్మానంపై మాట్లాడటం ఇష్టం లేకనో.. లేదా ఏమైన కొన్ని కారణాల వల్ల స్పందించకపోవడం శోచనీయం” అని అన్నారు. దీనికి కౌంటర్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేచి నిలబడి ముఖ్యమైన తీర్మానం గురించి చర్చ జరిగేటప్పుడు ప్రధానప్రతిపక్ష నాయకుడు అయిన కేసీఆర్ రాకుండ ఉండటం చాలా బాధాకరం..
కేంద్రంతో వాళ్ళు లాలూచీ పడ్డారు. అందుకే ఇవాళ చర్చకు రాలేదు ” అని అన్నారు. దీనికి సమాధానంగా కేటీఆర్ మాట్లాడూతూ ” ఇక్కడున్న మీకు మేము సరిపోతాము.. మీది ఆయన స్థాయి కాదు.. మేము సరిపోతామని మా నాయకుడు రాలేదు.. మా నాయకుడి స్థాయి నాయకుడు అటువైపు లేడని “కేటీఆర్ మాస్ కౌంటర్ ఇచ్చారు.