కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ ఝలక్

 కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ ఝలక్

Kalvakuntla Taraka Ramarao

తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ మంత్రి … బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఝలక్ ఇచ్చారు. తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమి జరుగుతుందో ప్రతీది మాకు తెలుస్తుంది..

పదేండ్ల పాటు అధికారంలో ఉన్నవాళ్లము.. మాకు అందులో అభిమానులు ఉంటారు.. ప్రభుత్వంలో జరుగుతున్న మోసాన్ని కుట్రలను మాకు చెప్తారు.. ప్రజలకు అన్యాయం చేస్తే ఊరుకోవడానికి వాళ్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు.. అభిమానులు.. కార్యకర్తలు కాదు కదా.

అందుకే ప్రజలకు అన్యాయం చేసే ఏ పనులు జరిగిన వాటి గురించి మాకు తెలియజేస్తారు. మొత్తం బయటకు తీస్తాము.. ఫార్మా సిటీ రద్ధు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా మంత్రి శ్రీధర్ బాబు స్టేట్మెంట్ ఇస్తారు .. హైకోర్టుకు మాత్రం ఫార్మా సిటీ ఉందని చెప్తారు. కోర్టులను కూడా మోసం చేస్తుంది ఈ ప్రభుత్వం అని ఆయన విమర్శలు ఎక్కుపెట్టారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *