అసెంబ్లీలో కేటీఆర్ ఉగ్రరూపం

 అసెంబ్లీలో కేటీఆర్ ఉగ్రరూపం

తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు బుధవారం ప్రారంభమయ్యాయి. ముందుగా డిప్యూటీ సీఎం.. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టారు.ఈ బిల్లుపై చర్చపై మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ అధికార పార్టీ కాంగ్రెస్ పై ఉగ్రరూపం చూపిస్తున్నారు.. మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” కొత్త బట్టల కోసం వెళ్తే ఉన్న బట్టలు ఊడగొట్టుకున్నట్లు తాము అధికారంలోకి వస్తే నెలకు ఆసరా నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు..

ప్రతి మహిళకు నెలకు రెండున్నర వేల రూపాయలు ఇస్తామన్నారు.. డిసెంబర్ తొమ్మిదో తారీఖున రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు.. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు.. రైతుభరోసా కింద రైతులకు ఎకరాకు పదిహేను వేలు ఇస్తామన్నారు.. రైతుకూలీలకు పన్నెండు వేలు ఇస్తామన్నారు. పదోతరగతి పాసైతే స్కూటీ ఇస్తామన్నారు ఇలా ప్రజల్లో అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చారు.. ఏడు నెలలైన కానీ ఒక్క హమీని కూడా నెరవేర్చలేదు..

మేము అధికారంలో ఉన్నప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చాము.. మేమే పరీక్షలు నిర్వహించాము.. మేమే వాటిని ఫలితాలను తేల్చాలనుకున్న సమయంలో ఎన్నికలు వచ్చాయి.. ఎన్నికల్లో ప్రజలు తీర్పునిచ్చారు. మేము ప్రతిపక్షంలో ఉన్నాము.. కాంగ్రెస్ ను అధికారంలో కూర్చోబెట్టారు.. మేము ఇవ్వాల్సిన ఫలితాలను మీరు ఇచ్చి అవేవో మేమే ఇచ్చినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు.. దమ్ముంటే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు.. ఇవ్వండి మేమే లక్ష మంది యువతతో ముఖ్యమంత్రితో సహా అందరికి సన్మానం చేస్తాము.. మేము అధికారంలో ఉన్నప్పుడు రెండు లక్షల నలబై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చాము.,.

లక్ష ఎనబై వేల ఉద్యోగాలను భర్తీ చేసాము..నలబై ఐదు వేల ఉద్యోగాల ఫలితాలను సిద్ధం చేశాము. మరో ముప్పై వేల ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించాలి. కానీ మీరు వచ్చి ఏడు నెలలైన కానీ ఇంతవరకు ఎలాంటి పురోగతి లేదు.. ఫించన్లు ను రికవరీ చేయాలని మీరే ఆదేశిస్తారు.. కళ్యాణ లక్ష్మీ రైతుబంధు సొమ్ములను రికవరీ చేస్తామని అంటున్నారు.. దమ్ముంటే వందరోజుల్లో మీరిచ్చిన హామీలను నెరవేర్చాలని ” డిమాండ్ చేశారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *