రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా పర్యటలో ఉన్న మాజీ మంత్రి కేటీ రామారావు మాట్లాడుతూ ఓట్ల కోసం… అధికారం కోసం మోసపూరిత హామీలను ఇచ్చాడు.
వాటిని అమలు చేయకుండా ప్రజలకు చెప్పి మరీ మోసం చేసిన నిజాయితీగల మోసగాడు ఏకైక సీఎం రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. మా పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా రూ. 10వేల రైతుబంధు ఇస్తే ఆయన రూ.15 వేలు ఇస్తానన్నారు.
ఇప్పుడేమో రూ. 12వేలే అంటున్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు కనీసం అవి కూడా దిక్కులేదు. రుణమాఫీ, బోనస్, మహిళలకు రూ.2500 సహా ఏ హామీ అమలు చేయలేదు. రేవంత్‌ను తిట్టినట్లు ఏ సీఎంను ప్రజలు తిట్టలేదు. తులం బంగారం ఇవ్వడం కాదు మహిళల మెడలో ఉన్న పుస్తెలతాడు లాక్కుంటున్నారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.
