రేవంత్ కు కేటీఆర్ బంపర్ ఆఫర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. నిన్న శుక్రవారం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మూసీ సుందరీకరణను అడ్డుకునేవాళ్ళు కసబ్ తో సమానం అని అన్నారు.
దీనికి కౌంటర్ గా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” కసబ్ ఏమి మాములు మనిషి కాదు.. ఆయన ఓ టెర్రరిస్ట్.. అందరూ చూస్తుండగానే ప్రజలను చంపిన ఉగ్రవాది.. ఆయనకు ఉరిశిక్ష పడటానికి కూడా నాలుగేండ్లు పట్టింది. అలాంటివాళ్లతో పోల్చడం ఆయన విఙతకే వదిలేస్తున్నాను.
ఆయన కూడా ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి తొమ్మిదేళ్లవుతుంది. ఆయనకు ఓ బంపర్ ఆఫర్ ఇస్తున్నను.. మీడియా సమావేశంలో మాటకు పదిసార్లు రీజువనేషన్ అనే పదం వాడారు. ఆ పదానికి ఆయన చూడకుండా స్పెల్లింగ్ చెబితే రూ. 50 లక్షలు పట్టే బ్యాగును బహుమానంగా ఇస్తాను.. ఎందుకంటే ఆయన ఊరికే ఢిల్లీకెళ్లాలి కదా డబ్బులను తీసుకోని అని అన్నాను..