మాజీ మంత్రి హారీష్ అరెస్ట్ అప్రజాస్వామికం..!
తెలంగాణ రాష్ట్రం లో ప్రశ్నించే గొంతు లేకుండా చేయాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న కుట్ర లో భాగంగానే మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకుల అరెస్ట్ లు అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు..
ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కారు ఏడాది పాలనలో హామీలను విస్మరించిందని, అభివృద్ధి లేకపోగా తెలంగాణ ఆగమైందన్నారు. లగచర్లలో ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వమని చెప్పిన రైతులపై అక్రమంగా సర్కారు కేసులు బనాయించి జైలుకు పంపిందన్నారు.
రాష్ట్రంలో అప్రజాస్వామికం పాలనా కొనసాగుతున్నది…! కాంగ్రెస్‌ది ప్రజాపాలన కాదని, ప్రతీకార పాలనగా అని అన్నారు..! ఇందుకేనా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాది..
మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి గార్లతోపాటు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకుల అరెస్ట్ లు అప్రజాస్వామికం..తక్షణం విడుదల చేయాలన్నారు..