రెడ్ బుక్ పై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు…!

Kodali Nani’s Sensational Comments on Red Book…!
ఏపీలో టీడీపీ అమలు చేస్తున్న రెడ్ బుక్ గురించి మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వానికి భయపడి మాజీ మంత్రి కొడాలి నాని అజ్ఞాతంలోకి వెళ్లారంటూ వస్తున్న వార్తల వేళ ఆయన విజయవాడ జైలు వద్ద కనిపించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి కొడాలి నానిని ‘రెడ్ బుక్ లో తర్వాత మీ పేరే ఉందటగా? మీపై 3 కేసులు నమోదయ్యాయని చెబుతున్నారు’ అని మీడియా ప్రశ్నించారు.
దీనికి సమాధానంగా ఆయన మాట్లాడూతూ ‘నేను రెడ్ బుక్ చూడలేదు. మీరు చూశారా? మూడు కాకుంటే 30 కేసులు పెట్టుకోనివ్వండి. అరెస్టులు చాలా చిన్న విషయాలు. అధికారంలో ఉన్నప్పుడు యాక్టివ్గా మాట్లాడాం. పదవి లేనప్పుడు ఏం మాట్లాడాలి?’ అని వ్యాఖ్యానించారు.
