కేసీఆర్ వ్యూహాం..హారీష్ రావు అమలు..దిగోచ్చిన కాంగ్రెస్.

 కేసీఆర్ వ్యూహాం..హారీష్ రావు అమలు..దిగోచ్చిన కాంగ్రెస్.

Loading

తెలంగాణ తొలి సీఎం ..బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల నిర్వహించిన సంగారెడ్డి జిల్లా పార్టీ నేతలతో సమావేశంలో మాట్లాడుతూ గతంలో మన ప్రభుత్వం మంజూరు చేసిన సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్టు లను  కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ  పనులు ఆపేసింది. ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వహిస్తూ  రైతులను ఎందుకు గోస పెడుతున్నది? ప్రాజెక్టుల కోసం రెండు నియోజకవర్గాల ప్రజలను సమీకరించి మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు నేతృత్వంలో జిల్లాలో  పెద్ద ఎత్తున దండయాత్ర చేయాలి..

ప్రత్యక్ష ప్రజాపోరాటాలు లేవదీసి ప్రభుత్వం మెడలు పంచాలి. నేను కూడా మీతోనే ఉంటాను అని అన్నారు.. పార్టీ ఆధినేత కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకూ ఈనెల పద్నాలుగో తారీఖున కోకాపేటలోని తన నివాసంలో మాజీ మంత్రి హారీష్ రావు జిల్లాకు చెందిన నేతలతో జరిగిన భేటీలో మాట్లాడుతూసంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులు పూర్తిచేసే దాకా ఉమ్మడి కార్యాచర ణను అమలు చేస్తూ కాంగ్రెస్ సర్కారు తీరును ఎండగడదాం. నీటి కోసం మరో పోరాటానికి సిద్ధ మవుదాం. రైతులకు మేలు జరిగేలా భవిష్యత్తు కార్యాచరణ చేపడదాం. పాదయాత్ర చేద్దాం అని తెలిపారు..

ఈ  నేపథ్యంలోనే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. నిలిపివేసిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల పనులను తిరిగి ప్రారంభించింది. సంగారెడ్డి జిల్లా మనూరు మండలం బోరంచలో 12 ఎకరాల్లో పంప్ హౌస్ నిర్మాణం కోసం తవ్వకం పనులను తిరిగి ప్రారంభించింది. సంగ మేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణ పనుల ప్రారంభానికి కూడా సాగునీటి పారుదలశాఖ చర్యలు ప్రారంభించింది.

భూసేకరణ అడ్డంకులను తొలగించి నిర్మాణ పనులు సత్వరం ప్రారంభించేందుకు అధి కారులు సిద్ధమవుతుండటంతో జిల్లా రైతాంగం కేసీఆర్ వ్యూహాన్ని హారీష్ రావు అమలు చేయాలని సిద్ధమవుతుండటంతో మొద్దు నిద్ర నుండి కాంగ్రెస్ లేచి ప్రాజెక్టుల పనులు ప్రారంభిస్తుండటం చాలా ఆనందంగా ఉంది..ప్రాజెక్టుల పనులు పూర్తయ్యేవరకు ప్రభుత్వాన్ని విడిచిపెట్టోద్దని బీఆర్ఎస్ పార్టీని వారు కోరుతున్నారు..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *