KCR మొక్క కాదు.. వేగు చుక్క…!
మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓ మొక్క అని అధికార కాంగ్రెస్ కు చెందిన నేతలు ఆరోపిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ మొక్క కాదు… వేగు చుక్క.. తెలంగాణ రాష్ట్ర స్వప్నాన్ని నెరవేర్చిన సేనాని.
పదేండ్లలో దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని సంక్షేమాభివృద్ధిలో నంబర్ వన్ స్థానంలో నిలబెట్టిన అభివృద్ధి ప్రధాత. అలాంటి వ్యక్తిని పట్టుకుని మొక్క అనడం వాళ్లకే చెల్లింది. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో నిధుల వరదపారాయి. కాంగ్రెస్ పది నెలల పాలనలో తిట్లు పారుతున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
జగిత్యాల కోరుట్ల కు చెందిన బీఆర్ఎస్ నేతలు.. కార్యకర్తలతో ఎమ్మెల్సీ కవిత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ‘యథా రాజా.. తథా ప్రజా అన్నట్లుగా కాంగ్రెస్ పాలన కొనసాగుతుంది. కేసీఆర్ రేవంత్ గురువుకే చుక్కలు చూపించిన నాయకుడు అని ఆమె అన్నారు.