వైసీపీ ఓటమిపై కాసు మహేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

3 total views , 1 views today
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమికి గల కారణాల గురించి మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా పార్టీ నేతలు..కార్యకర్తలు చాలా మంది నన్ను కలుస్తున్నారు.. పార్టీ ఓటమి గురించి పలు రకాల కారణాలు చెబుతున్నారు..
కరోనా లాంటి మహమ్మారిని సైతం తట్టుకుని ఐదేండ్లు అభివృద్ధి సంక్షేమం రెండు కండ్లలా భావించి మాజీ ముఖ్యమంత్రి..వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశారు.. కానీ టీడీపీ వాళ్లు ప్రచారం చేసిన నకిలీ మద్యం అంటూ అసత్య ప్రచారాన్ని ప్రజలు బాగా నమ్మారు.. ఎన్నికల్లో అమలు కానీ హామీలను ప్రజలపై రుద్దడంలో టీడీపీ శ్రేణులు విజయవంతం అయ్యారు అని ఆయన అన్నారు..
ఇసుక విధానం వల్ల ఓ వర్గంలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది..ల్యాండ్ లైటింగ్ చట్టంపై అసత్య ప్రచారం బాగా నష్టం చేకూర్చింది.. టీడీపీ నుండి వైసీపీలో చేరిన కొంతమంది ఎమ్మెల్యేలుగా..మంత్రులుగా ఉండి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అండ్ బ్యాచ్ ను బూతులు వ్యక్తిగత దూషణలు చేయడం వల్ల తీవ్ర నష్టం జరిగింది అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు..
