బెజవాడపై గురిపెట్టిన జనసేనాని-ఎడిటోరియల్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో జనసేన పేరుతో పార్టీ పెట్టిండు.. అప్పట్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ హాఠావో … దేశ్ బచావో అనే నినాదంతో అప్పట్లో టీడీపీ,బీజేపీ కూటమికి మద్ధతు ఇచ్చి ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని దూరం చేయడంలో విజయవంతమయ్యాడు జనసేనాని పవన్ కళ్యాణ్.. అనంతరం ఐదేండ్ల తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగడమే కాకుండా ఏకంగా తాను పోటి చేసిన రెండు స్థానాల్లో సైతం ఓటమిపాలయ్యాడు.. తన పార్టీలో గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే అధికార వైసీపీ లో చేరడంతో జనసేనాని పని అయిపోయింది.
రాజకీయాలు మానేసి రీమేక్ సినిమాలు చేస్కోవడం బెటర్ అంటూ ఇటు రాజకీయ వర్గాలు.. అటు రాజకీయ విశ్లేషకులు పలుమార్లు వ్యాఖ్యానించారు.. ఒకానోక సమయంలో ఫ్యాకేజీలు తీసుకుంటూ టీడీపీ అధినేత .. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాట పాడుతున్నాడంటూ వైసీపీ శ్రేణులు చేసిన ప్రధాన ఆరోపణ.. ఇలా ఎన్నో అవమానాలు అవహేళనలు ఎదుర్కున్న జనసేనాని ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా విడివిడిగా పోటి చేస్తే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలుతుంది..
తద్వారా అధికార వైసీపీకి ప్లస్ అవుతుంది అని భావించి ఢిల్లీకి పలుసార్లు వెళ్ళి ఏకంగా బీజేపీ జాతీయ అధిష్టానాన్ని ఒప్పించి మరి టీడీపీతో కల్సి ఎన్డీఏ కూటమిగా బరిలోకి దిగేలా అనేక ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యారు.. దీంతో ప్రభుత్వ ఓటు బ్యాంకు చీలకుండా మొత్తం ఓట్లు కూటమి అభ్యర్థులకు పడేలా విజయవంతమవ్వడంతో ఆ కూటమికి ఏకంగా 164 స్థానాల్లో గెలుపొందడానికి కృషి చేశాడు.. తాను పోటి చేసిన స్థానంలోగెలవడమే కాకుండా తమ పార్టీ తరపున పోటి చేసిన ఇరవై ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాల్లో… రెండు పార్లమెంట్ స్థానాల్లో గెలవడంతో ఇండియన్ పొలిటిక్స్ హిస్టరీలో వందశాతం స్ట్రైక్ రేటుతో గెలిచిన పార్టీగా జనసేన నిలవడంలో జనసేనాని సత్తా ఏంటో యావత్ దేశానికి ఆర్ధమైంది..
అందుకే తన సత్తా భవిష్యత్తు రాజకీయాలకు పునాదిపడేలా చేసుకుంటున్నాడు జనసేనాని.. మున్ముందు జరగనున్న స్థానిక పురపాలక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని విజయవాడ వేదికగా అప్పుడే తన రాజకీయాలను మొదలెట్టాడు.. అందుకే గతంలో ప్రజారాజ్యం పార్టీకి అండగా నిలిచిన విజయవాడ నగరంలో జనసేన పార్టీని బలోపేతం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. గత ఎన్నికలకు ముందు పోతినేని మహేష్ లాంటి నాయకులు పార్టీని వీడిన కానీ తనకు పార్టీ… క్యాడర్ ముఖ్యమంటూ సాంకేతాన్ని ఇస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు.. గత రెండు నెలలుగా డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్.. మంత్రిగా నాదేండ్ల మనోహార్ విజయవాడ సెంట్రల్..ఈస్ట్..వెస్ట్ నియోజకవర్గాల్లో పార్టీ .. అధికార కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యారు..
ఏకంగా పది లక్షల సభ్యత్వం నమోదు చేయాలని లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారంటే పవన్ ముందుచూపు ఎంతగా ఉందో ఆర్ధమవుతుంది.. పార్టీకి కానీ పవన్ కు కానీ రాజకీయంగా ఆర్థికంగా సామాజిక వర్గం పరంగా పట్టు ఉంటుంది.. ఎందుకంటే ప్రజారాజ్యం సమయంలో రెండు స్థానాల్లో ఎమ్మెల్యేలను అందించింది బెజవాడ.. అందుకే ఇక్కడ నుండే తన రాజకీయ చతురతను ప్రదర్శించడం.. పవన్ అంటే జనసేన అంటే ఉభయ గోదావరి జిల్లాల్లోనే కాదు యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఉందని నిరూపించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే గత ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలుపుకోసం తమకు గెలిచే అవకాశాలున్న కానీ సీట్లను ఒదులుకున్నారు..
కానీ ఇప్పుడు అక్కడ ఇంచార్జులను నియమించుకుని మిత్ర పక్షాలతో సఖ్యతగా వెళ్తూ పార్టీని బలోపేతం చేస్తుండటం మున్ముందు టీడీపీ వైసీపీకి ప్రత్యామ్నాయ పార్టీగా అవతరించడంలో ఎలాంటి సందేహాం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు..చూడాలి మరి మర్రి చెట్టు లాంటి టీడీపీ కింద జనసేన ఎంతగా ఎదుగుతుందో అని..?