కేటీఆర్ కు జగ్గారెడ్డి కౌంటర్

Turpu Jayaprakash Reddy Former MLA
మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ .. మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) కౌంటర్ ఇచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తే నాలుక కోస్తామని బీఆర్ఎస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు.
ఎమ్మెల్యేలు అరికెలపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డి ల మధ్య వివాదం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది అని ఆయన అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొడితే బాగుండదు.. తమ జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు.
హైదరాబాద్ మహానగరం చాలా ప్రశాంతంగా ఉంది. హైదరాబాద్ లో అల్లకల్లోలం సృష్టించడానికి బీఆర్ఎస్ కుట్రలు చేస్తుంది. పోలీసులు బీఆర్ఎస్ నేతలను పట్టించుకోవాల్నా..?. ప్రజలను పట్టించుకోవాల్నా ..?అని ఆయన ప్రశ్నించారు.