హారీష్ రావు కు జగ్గారెడ్డి సవాల్

Ex MLA Jaggareddy
మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావుకు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి ఆలియాస్ జగ్గారెడ్డి సవాల్ విసిరారు. గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ ” పంట రుణాల మాఫీపై మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అన్ని అబద్ధాలు చెబుతున్నారు.
అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే పద్దెనిమిది వేల కోట్ల రుణాలను మాఫీ చేశాము. దసరా లోపు రెండు లక్షలకు పైగా రుణాలను ఎలాంటి షరతుల్లేకుండా మాఫీ చేయాలి. లేకపోతే ఢిల్లీలో రాహుల్ గాంధీ ఇంటి ఎదుట ధర్నా చేస్తాను అని హారీష్ రావు అంటున్నారు.
ఆ రోజు నేను కేసీఆర్ ఫామ్ హౌజ్ దగ్గర ధర్నాకు దిగుతాను.. ఖమ్మంలోని రైతుల చేతులకు బేడీలు వేసినప్పుడు కేసీఆర్ గుండె ఎక్కడకి పోయింది. మల్లన్న సాగర్ రైతులను అరెస్ట్ చేసినప్పుడు కేసీఆర్ గుండె ఫ్రిజ్ లో పెట్టారా అని ఆయన అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ దమ్ముంటే కేసీఆర్ ను రుణమాఫీపై చర్చకు ఒప్పించు.. నేను రేవంత్ రెడ్డిని ఒప్పిస్తాను అని అన్నారు.