బట్టలూడదీసి మరి..ఎవర్ని వదిలిపెట్టను..- జగన్ మాస్ వార్నింగ్..!

Jagan’s mass warning…I will not leave anyone behind…
ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత అధికార పార్టీ నేతలకు.. ఆ పార్టీకి వంతపాడే అధికారులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. జైళ్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ” ఏపీలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. వ్యవస్థలన్నీ దిగజారిపోయాయి.
పిడుగురాళ్ల మున్సిపాలిటీలో ఒక్క కౌన్సిలర్ ను గెలవని టీడీపీ ముప్పై మూడు మంది వైసీపీ కౌన్సిలర్లను తమ పార్టీలోకి లాక్కుని మున్సిపాలిటీని దక్కించుకోవడం ప్రజాస్వామ్యం ఎంత దిగజారిపోయిందో ఆర్ధమవుతుంది. పోలీసులు టోపీపై ఉన్న సింహానికి సెల్యూట్ కొట్టండి.
టీడీపీ నేతలకు కాదు. వారు చెప్పినట్లు మీరు నడుచుకోని వైసీపీ నేతలపై.. కార్యకర్తలపై అక్రమంగా అన్యాయంగా కేసులు పెట్టి వేధిస్తే ఎవర్ని వదిలిపెట్టను. అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదిలిపెట్టం. రిటైర్మెంట్ ప్రకటించిన కానీ ఏడు సముద్రాల అవతల ఉన్నా తీసుకోస్తాం.. చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ఊర మాస్ వార్నించారు.
