ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సాధించాలనే పట్టుదలతో ఉన్న జగన్ -ఎడిటోరియల్ కాలమ్.

 ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సాధించాలనే పట్టుదలతో ఉన్న జగన్ -ఎడిటోరియల్ కాలమ్.

ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వై నాట్ 175అనే నినాదంతో ఎన్నికల్లోకి వెళ్లిన జగన్ నేతృత్వంలో వైసీపీకి వచ్చింది కేవలం పదకొండు ఎమ్మెల్యే స్థానాలే.. అయితే కర్ణుడి చావుకు వంద కారణాలు అన్నట్లు వైసీపీ ఓటమికి వంద కారణాలు.. అయితే ఓటమి చెందిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వందరగానే మేల్కొన్నారు..అందుకే ఎన్నికల సమయంలో ఈవీఎం మిషన్ల ధ్వంశం కేసులో అరెస్ట్ కాబడి పోలీస్ స్టేషన్ లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డిని ఏకంగా బెంగుళూరు నుండి వెళ్లి మరి పరామర్శించిండు..

అంతే కాకుండా పల్నాడు జిల్లాలో అధికార టీడీపీ పార్టీ నేతల దాడిలో తీవ్రంగా గాయపడిన మృతిచెందిన రషీద్ కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని భరోసానిచ్చాడు.. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జీరోకి పరిమితమైన జిల్లాల్లో ఒకటి గుంటూరు. అలాంటి జిల్లా నుండే వైసీపీ బలోపేతం చేయడానికి కంకణం కట్టుకున్నారు వైఎస్ జగన్మోహాన్ రెడ్డి. ముందుగా గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డిని నియామించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది..

అంతేకాకుండా పల్నాడు కు బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతను నియమించి.. బాపట్ల కు మాజీ మంత్రి మేరుగ నాగార్జున ను నియమించాలని జగన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.. ఇలా పార్టీలకు చీఫ్ లను నియమించి స్థానిక క్యాడర్ కు నాయకులను అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు వైఎస్ జగన్మోహాన్ రెడ్డి.. దీంతో స్థానిక క్యాడర్ కు భరోసానివ్వడమే కాకుండా పార్టీ బలోపేతం చేయడానికి వీలుంటుంది అని వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు.. ఇలా పార్టీ ఓటమి అనంతరం ఢీలా పడిపోకుండా క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణూలకు అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతం చేస్తుండటం ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సాధించాలనే పట్టుదలతో జగన్ ముందుకు సాగుతున్నట్లు తెలుస్తుంది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *