బలమున్న భయపడుతున్న జగన్.!. ఎందుకు..?
గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం 162, వైసీపీ పదకొండు స్థానాల్లో గెలుపొందిన సంగతి తెల్సిందే. ఈ లెక్కన శాసనసభలో కూటమి ప్రభుత్వమే మెజార్టీ స్థానాలను దక్కించుకున్నట్లైంది. కానీ మరోవైపు శాసనమండలిలో మాత్రం వైసీపీ పార్టీకే మెజార్టీ సభ్యులున్నారు. గతంలో శాసనసభలో తక్కువ మంది సభ్యులున్న టీడీపీ మండలిలో మెజార్టీ సభ్యులుండటంతో ఐదేండ్లు అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని మండలిలో చెడుగుడు ఆడుకుంది.
ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తూ తమ సత్తాని చాటింది టీడీపీ.. కానీ తాజాగా మండలిలో మెజార్టీ ఉన్న కానీ వైసీపీ టీడీపీకి లొంగినట్లైంది. ఇప్పటికే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వని కారణంగా శాసనసభకు రాబోము అని భీష్మించుకుని కూర్చున్న జగన్ మండలిలో మెజార్టీ ఉన్న కానీ ప్రభుత్వాన్ని ఇరుకునపడేయటంలో విఫలమయ్యారనే వాదన ఉంది.
నిన్నటి మండలిలో విద్యుత్ సుంకం -2024 సవరణ బిల్లును తమకు ఆధిక్యత లేకపోయిన కూటమి ప్రభుత్వం ఆమోదించుకోవడం గమనార్హం. మండలిలో బలమున్న కానీ ఎందుకు కూటమి ప్రభుత్వ తప్పులపై మాట్లాడటం లేదు.. ఇప్పటికే శాసనసభకు పోకుండా అప్రతిష్టతను దక్కించుకున్న వైసీపీ అధినేత జగన్ మండలిలో బలమున్న ఇలా వ్యవహారించడం పాత జగనేనా ఇతను అని రాజకీయ వర్గాలు.. వైసీపీ శ్రేణులు ప్రశ్నించుకుంటున్నారు. ఇప్పటికైన జగన్ తనదైన శైలీలో కూటమి ప్రభుత్వంపై పోరాడాలని వారు సూచిస్తున్నారు.