జగన్ మాస్ వార్నింగ్.. ఎవరికి…?
వైసీపీ అధినేత .. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగామ సురేష్ ను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ” అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఈరోజు మీరు అధికారంలో ఉంటారు. రేపు మేము అధికారంలోకి వస్తాము. రెడ్ బుక్ పెట్టుకోవడం అదేమి ఘన కార్యం కాదు.. అది మీ సొంతమే కాదు. సాక్షులను బెదిరించి వైసీపీ నేతలపై అక్రమ కేసులను పెట్టి జైల్లో పెడుతున్నారు.
మేము ఐదేండ్ల అధికారంలో మీలా ప్రవర్తించి ఉంటే ఇప్పుడు మీ పార్టీలో కార్యకర్త అనేవాడు మిగిలేవాడు కాదు. అసభ్య పదజాలంతో దూషించిన నేను భరించాను.. ఈరోజు టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిందంటూ అరెస్ట్ చేసినవారంతా ఆరోజు సంఘటనలో ఎవరూ లేరు. ప్రజలు మనకు ఓ బాధ్యత అప్పజెప్పినప్పుడు ఆ బాధ్యతను నెరవేర్చే దిశగా పని చేయాలి..
వరదలు వస్తాయని నాలుగు రోజుల ముందే తెల్సినప్పుడు చంద్రబాబు సర్కారు ఏమి చేశారు. తుఫాన్ అలెర్ట్ వచ్చిన రోజు ఎందుకు ముఖ్యమంత్రిగా సమీక్ష సమావేశం నిర్వహించలేదు. సాక్షాత్తు రెవిన్యూ, సీఎస్ లే తుఫాన్ వస్తుంది.. విజయవాడకు వరదలు వస్తాయని నాలుగు రోజుల ముందే తెలుసు అని అంటున్నారు. నాలుగు రోజుల ముందు తెలిస్తే ఏమి చేశారు..
ప్రజలను ఆ వరదల్లో ముంచాలని చూశారా.. ముఖ్యమంత్రి చేతకాని తనం వల్లనే అరవై మంది దాక ప్రాణాలు వదిలారు.. వేల కోట్ల నష్టం చేకూరింది. వైసీపీ నేతలను అక్రమ కేసులతో.. బెదిరింపులతో వేధిస్తే చూస్తూ ఊరుకోను. మేము అధికారంలోకి వచ్చాక మీరంతా మావాళ్లు ఉన్న జైల్లో ఉంటారని ఆయన మాస్ వార్నింగ్ ఇచ్చారు.