బీఆర్ఎస్ నేతలనడ్డుకోవడం దుర్మార్గం

Former Minister Harish Rao who once again showed humanity
3 total views , 1 views today
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నల్గోండ జిల్లా రామన్నపేటలో నిర్మించ తలపెట్టిన అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీపై నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణకు బీఆర్ఎస్ నేతలు వెళ్లకుండా అడ్డుకోవడం దుర్మార్గం అని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు..
నల్గొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్, మాజీ ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, గాదరి కిషోర్ సహా ఇతర నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులను అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము.
స్వేచ్ఛగా జరగాల్సిన ప్రజాభిప్రాయసేకరణ, ఇంతటి నిర్బంధాల మధ్య చేయడం అప్రజాస్వామికం. ప్రజాపాలన అంటూ నిర్బంధాల పాలన కొనసాగించడం సిగ్గుచేటు.అక్రమంగా అరెస్టులు చేసిన బీఆర్ఎస్ నాయకులను, ప్రజా సంఘాల నేతలను, పర్యావరణవేత్తలను తక్షణం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు.
