కేటీఆర్ అరెస్ట్ తప్పదా..? – కాంగ్రెస్ వ్యూహాం ఇదేనా..?

భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ ..మాజీ మంత్రి కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారంటూ గత రెండు మూడు నెలలుగా రాజకీయ వర్గాలతో పాటు సర్వత్రా చర్చ జరుగుతున్నది.కొన్ని మీడియా సంస్థలు నేడు అరెస్ట్,రేపు అరెస్ట్ అంటూ కథనాలను సైతం ప్రచురిస్తూ వస్తున్నప్పటికి కేటీఆర్ అరెస్ట్ ఈ రోజు వరకు జరగలేదు.లగచర్ల లో ఇటీవల జరిగిన సంఘటనలలో భాగంగా స్థానికి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు స్థానిక రైతులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది రేవంత్ సర్కార్.ఆకేసులో కేటీఆర్ ను సైతం అరెస్ట్ చేస్తారని ఊహాగానాలు తెరపైకి వచ్చాయి,కానీ అది జరగలేదు..
తాజాగా ఫార్ములా – ఈ రేసు విషయంలో కేటీఆర్ పై కేసు నమోదైన విషయం తెలిసిందే.ఈ కేసులో కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారని మీడియా,రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.అయితే కేటీఆర్ అరెస్ట్ విషయంలో కాంగ్రేస్ ఎందుకు తాత్సారం చేస్తుంది.? కేటీఆర్ అరెస్ట్ తో కాంగ్రెస్ కు లాభమా నష్టమా.? కేటీఆర్ అరెస్ట్ నిలబడుతుందా.? అంటే విశ్లేషకుల నుండి రకరకాల చర్చలు జరుగుతున్నాయి.ఇటీవల లగచర్ల రైతులకు బేయిల్ రావటం,అసెంబ్లీలో ప్రతిపక్ష బీఆర్ఎస్ హరీశ్ రావు దూకుడుగా వ్యవహరించి ప్రజల్లో బీఆర్ఎస్ పట్ల చర్చ పెరగటం,హైడ్రా యూటర్న్ తో కూల్చబడిన ఇండ్ల సంగంతేంటంటూ ప్రజల్లో వచ్చిన వ్యతిరేఖత ఇలా అనేక అంశాల్లో ప్రభుత్వంలో తీవ్ర వ్యతిరేఖ చర్చ జరుగుతుంది.
కాంగ్రేస్ ప్రభుత్వం వచ్చాక ఏడాదిలో 1,27,000 కోట్ల అప్పు తీసుకుందని ప్రభుత్వం ప్రకటించడం దాన్ని బీఆర్ఎస్ ప్రజల్లోకి వేగంగా చర్చలేపడం వెరసి కాంగ్రేస్ పై ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారు.విస్తృతంగా చర్చ జరుగుతుంది.ఈ చర్చను పక్కదారి పట్టించేందుకు సరైన ఆదారాలు లేకున్నా కే.టీ.ఆర్ ను అరెస్ట్ చేయాలని కాంగ్రేస్ అనుకుంటుంది.ప్రజల దృష్టి మరల్చి కాంగ్రేస్ పై వచ్చిన వ్యతిరేఖతను కే.టీ.ఆర్ అరెస్ట్ ద్వారా చర్చ డైవర్ట్ చేయాలని కాంగ్రేస్ ప్రయత్నిస్తుందనేది సుస్పష్టంగా కనబడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.మరి కేటీఆర్ అరెస్ట్ చేస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే.