హెచ్ సీయూ భూకుంభకోణంలో బీజేపీ ఎంపీ ఇతనే..?

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలిలో ఉన్న నాలుగు వందల ఎకరాలను ఐసీఐసీఐ బ్యాంకులో తనఖా పెట్టి పదివేల కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుగా తీసుకుంది. అయితే ఆ భూములు అటవీ శాఖకు చెందినవే.
ఆ భూముల ఓనరు ఎవరూ.. ఆ భూములపై రుణాలు ఇవ్వోచ్చా లేదా అని కనీసం ఎంక్వైరీ చేయకుండా బీజేపీ కి చెందిన ఓ ఎంపీ కనుసైగల్లో ఆ బ్యాంకు ఇచ్చింది. ఇందుకుగానూ రూ.170కోట్లను ట్రస్ట్ ఎడ్వజైర్స్ ఇన్వెస్ట్మెంట్ అనే కంపెనీకి రేవంత్ రెడ్డి లంచం ఇచ్చారు అని మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో పేర్కొన్న సంగతి తెల్సిందే.
అయితే ఆ ఎంపీ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాదు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇటీవల టీడీపీ నుండి బీజేపీలో చేరి ఎంపీగా గెలుపొందిన వ్యక్తి అని రాజకీయ వర్గాల ఇన్నర్ టాక్. ఇటీవల మహబూబ్ నగర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో సైతం ఆ బీజేపీ పాల్గోన్నారు.
అప్పుడు ఈ కుంభకోణానికి బీజం పడింది. సుప్రీం కోర్టు ఆదేశాలతోనే ఇది వెలుగులోకి వచ్చిందని రాష్ట్ర రాజకీయాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి. అయితే ఆ ఎంపీ అటు ఆంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అత్యంత ఆప్తుడని కూడా వారు వ్యాఖ్యానిస్తున్నారు. చూడాలి మరి ఆ ఎంపీ ఆంధ్రానా..?. తెలంగాణ వ్యక్తిగా మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది.
