ఇదేనా… ప్రజాపాలన…?

Former Minister Harish Rao
తెలంగాణలో చర్చాంశనీయమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంలో ఏఐ ఫేక్ వీడియోలు.. ఫోటోలతో సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ప్రజలను తప్పుతోవ పట్టించారు. ప్రభుత్వానికి చెడ్ద పేరు తీసుకు వచ్చారు. ఈ నెల 09న గచ్చిబౌలి పీఎస్ లో విచారణకు హాజరు కావాలని బీఆర్ఎస్ కు చెందిన రాష్ట్ర యువ నాయకులు మన్నె క్రిషాంక్ .. బీఆర్ఎస్ డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
దీంతో వీరిద్దరూ ఈరోజు బుధవారం గచ్చిబౌలి పీఎస్ కు విచారణ నిమిత్తం పదిగంటలకు చేరుకున్నారు. అప్పటి నుండి రాత్రి తొమ్మిదిన్నరవరకూ విచారించారు పోలీసులు. దీనిపై మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. ఎక్స్ లో పోలీసు అధికారులు కోణతం దిలీప్ , మన్నె క్రిషాంక్ లను దాదాపు తొమ్మిది గంటల పాటు విచారించడం ప్రజాపాలననా..?. అని ప్రశ్నించారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు, హైదరాబాద్ జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు మద్ధతు ఇచ్చినందుకు ఇప్పుడు వారి పోన్ల కోసం వారింట్ల రాత్రి పూట సోదా చేయడం దారుణం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేతిలో రాజ్యాంగ పట్టుకుని దేశంలోని హక్కుల గురించి మాట్లాడుతారు. మరి కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో జరుగుతున్న తీరుపై ఎందుకు మాట్లాడరు. తెలంగాణలో విలువలను రాజ్యాంగాన్ని ఖూనీ చేయడం కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం అని పోస్టు చేశారు.
