కేటీఆర్ ప్రకటనలకే పరిమితమా..?.

 కేటీఆర్ ప్రకటనలకే పరిమితమా..?.

KT Rama Rao

కేటీఆర్ మూడు అక్షరాలు కాదు రాబోయే మూడు తరాల పాటు గుర్తు పెట్టుకునే పేరు. ఉద్యమ నాయకుడిగా స్వరాష్ట్ర సాధన కోసం కోట్లాడిన యోధుడు.. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పదేండ్ల పాటు ఐటీ మినిస్టర్ గా.. మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా తనదైన శైలీలో దేశంలోనే మార్కు చూపించిన యూత్ ఐకాన్. ఐటీలో సరికొత్త పుంతలు తొక్కించిన ఐటీ నిపుణుడు. అలాంటి కేటీఆర్ కేవలం ప్రకటనలకే పరిమితమైండా అని ఇటు గులాబీ క్యాడర్ అటు ప్రజలు,మేధావులు సందిగ్ధంలో ఉన్నారు. నిన్న గురువారం ట్విట్టర్ వేదికగా #ASKKTR ప్రోగ్రామ్ లో నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు మాజీ మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు.

కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు. ప్రజల తరపున ప్రజాక్షేత్రంలో ఎప్పుడు కొట్లాడతారని పలు ప్రశ్నలను సంధించారు. ఈ ప్రశ్నలన్నింటికి మాజీ మంత్రి కేటీఆర్ సమాధానమిస్తూ 2025లో కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వస్తారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి ఏడాది సమయం ఇవ్వాలని మా ఆధినేత అనుకున్నారు. ఈ డిసెంబర్ తో ఏడాది పూర్తవుతుంది. ఆ తర్వాత ఆయన జనంలోకి వచ్చి ప్రభుత్వ వైపల్యాలను ప్రశ్నిస్తారు అని సమాధానం ఇచ్చారు. అసలు అక్కడ చిక్కు ఇక్కడే వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత అదిగో పులి అంటే ఇదిగో పులి అన్నట్లు మాజీ మంత్రి కేటీఆర్ ఎప్పుడు ప్రెస్మీట్ పెట్టిన.. మీడియాతో చిట్ చాట్ చేసిన కేసీఆర్ త్వరలో వస్తారు. అక్టోబర్ లో వస్తారు.. దసరాకు వస్తారు.. దీపావళి కి వస్తారు.. డిసెంబర్ లో వస్తారని లీకులిచ్చారు.

క్యాడర్ లో జోష్ నింపడానికి అనుకుంటే ఒకటికి రెండు సార్లు మహా అయితే మూడు సార్లు ఇలా మాట్లాడోచ్చు .. కానీ ప్రతిసారి హన్మంతుడి పెళ్లి ఎప్పుడంటే రేపు అన్నట్లు కేసీఆర్ రాక ఎప్పుడంటే పదే పదే దాటేసే సమాధానాలివ్వడం కేవలం ప్రకటనలకే పరిమితం తప్పా కేసీఆర్ ఏంట్రీ ఇప్పట్లో ఉండదేమో అని ఇటు క్యాడర్ అటు మేధావులు,ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటికైన కేటీఆర్ కేసీఆర్ ఏంట్రీ గురించో ప్లాన్ ఆఫ్ యాక్షన్ గురించో బహిర్గతం చేయకపోయిన కానీ క్యాడర్ కు .. నమ్ముకున్న నాయకులకు చెబితే సరిపొద్ది అంటున్నారు రాజీకీయ వర్గాలు. ఎందుకంటే కేసీఆర్ ఇప్పట్లో బయటకు వచ్చిన లాభం లేదు. కోరి తెచ్చుకున్న ప్రభుత్వంలో తమకు ఎలాంటి న్యాయం జరిగింది..

గత పదేండ్లలో ఎలాంటి న్యాయం జరిగిందో స్వతహాగా ప్రజలే తమకు తాము తెలుసుకోవాలి.. అప్పుడే కేసీఆర్ రాకకు బలం చేకూరుతుంది. ఇనుము వేడిగా ఉన్నప్పుడే వంచాలి తప్పా చల్లారిన తర్వాత కాదు. అట్నే ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చినప్పుడే నాయకుడు ముందుకు రావాలి తప్పా జనంలో మార్పు రానంతవరకు కాదు .

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *