కేసీఆర్‌.. కిష‌న్ రెడ్డి, బండి సంజ‌య్‌ల‌కు ఆహ్వానం…

 కేసీఆర్‌.. కిష‌న్ రెడ్డి, బండి సంజ‌య్‌ల‌కు ఆహ్వానం…

డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన స‌చివాల‌యంలో డిసెంబ‌రు 9న తెలంగాణ త‌ల్లి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రిస్తున్నామ‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సంద‌ర్భంగా 7, 8, 9 తేదీల్లో సచివాలయ ప్రాంగణం.. నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్‌ ప‌రిస‌ర ప్రాంతాల్లో తెలంగాణ సంబరాలు అద్భుతంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు సీఎం చెప్పారు. తెలంగాణ  సంస్కృతికి ప‌ట్టం క‌ట్టే కార్య‌క్రమాలు, పిండి వంట‌లు, మ‌హిళా సంఘాల స్టాళ్ల‌తో ఒక పండ‌గ వాతావార‌ణం నెలకొంటుంద‌ని సీఎం చెప్పారు.

బోనాలు, వినాయ‌క నిమ‌జ్జ‌నం చేసుకునేప్పుడు ఎలాంటి వాతావ‌ర‌ణం ఉంటుందో అలాంటి వాతావ‌ర‌ణం ఉంటుందన్నారు. ప్ర‌జ‌లంతా వాటిలో పాల్గొనాలని సీఎం పిలుపునిచ్చారు.

తెలంగాణ త‌ల్లి విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు ప్ర‌తిప‌క్ష నేత కేసీఆర్‌, కేంద్ర మంత్రులు కిష‌న్ రెడ్డి, బండి సంజ‌య్‌తో పాటు ఎంఐఎం, సీపీఐ, ఇత‌ర ప్ర‌తిప‌క్ష‌ నేత‌ల‌ను ఆహ్వానిస్తున్న‌ట్లు సీఎం తెలిపారు. కేసీఆర్ తో పాటు కేంద్ర మంత్రుల‌ను రాష్ట్ర మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ స్వ‌యంగా క‌లిసి ఆహ్వానిస్తార‌ని సీఎం తెలిపారు. ఈ ఉత్స‌వానికి ప్ర‌తిప‌క్ష నేత వ‌చ్చి పెద్ద‌రికం నిలుపుకోవాల‌ని సీఎం సూచించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *