రాజీవ్ గాంధీ విగ్రహాం ఏర్పాటు- కేటీఆర్ పిలుపు

Big shock for former minister KTR..!
డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెల్సిందే.. ఆస్థలంలో దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు సోమవారం నాలుగంటలకు ఆవిష్కరించింది. దీనిపై తెలంగాణ వాదులు,బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు.
తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వ్యతిరేకంగా రేపు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలభిషేకాలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. రేపు తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేయాలని ప్రజలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
తెలంగాణ తల్లి కోసం కేటాయించిన స్థానంలో కేవలం రాజకీయ దురుద్దేశంతో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి, తెలంగాణ తల్లిని అవమాన పరిచిన రేవంత్ రెడ్డి వైఖరిని ప్రతి ఒక్కరు ఖండించాలి ..తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసిన కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారు.తెలంగాణ సెంటిమెంట్‌తో పెట్టుకున్నోళ్లెవరూ రాజకీయాల్లో బతికి బట్టకట్టలేరన్న విషయం రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి అని ఆయన తెలిపారు.