నేను కొంచెం రౌడీ టైప్ – ఎమ్మెల్సీ కవిత..!

బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ మహిళ నాయకురాలు.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు మంగళవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈనెల ఇరవై ఏడో తారీఖున జరగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై జిల్లాలోని ముఖ్య నేతలతో సమావేశంలో భాగంగా బాన్సువాడలో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ” కేసీఆర్ సారు చాలా మంచివారు. నేను కేసీఆర్ సారు అంత మంచిదాన్ని కాదు. నేను రౌడీ టైప్. రజతోత్సవ వేడుకలకు వెళ్లకండి అని పోలీసు స్టేషన్ల నుండి బెదిరింపు కాల్స్ చేయిస్తున్నారు. కేసులు పెడుతున్నారు. అని మా పార్టీ నేతలు.. కార్యకర్తలు చెబుతున్నారు. మేము ఎవర్ని వదిలిపెట్టము.
వాళ్లందరి పేర్లను పింక్ బుక్ లో రాస్తాము. అధికారంలోకి వచ్చాక వాళ్ల సంగతి తేలుస్తాము అని హెచ్చారించారు. మీరు రాజ్యాంగ ప్రకారం చట్టం పరిధిలో పని చేయండి. తప్పు చేస్తే ఎంతటివార్ని అయిన శిక్షించండి. కానీ అక్రమ కేసులు పెట్టి బీఆర్ఎస్ కార్యకర్తలను నేతలను భయపెట్టాలని చూస్తే ఊరుకునేదే లేదని ఆమె అన్నారు.
