సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ..!

Anumula Revanth Reddy
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో బీఆర్ఎస్ కు చెందిన ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కలిశారు.
ఈ భేటీ సందర్భంగా త్వరలో జరగనున్న తన కూతురు వివాహానికి ఆహ్వానించడానికి సీఎం రేవంత్ రెడ్డిని తన కుటుంబ సభ్యులతో కల్సి వెళ్లారు.
ఈ క్రమంలో రేవంత్ రెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఎమ్మెల్యే బీఎల్ఆర్ తో పాటు నల్గోండ కాంగ్రెస్ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి సహా పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఈ సందర్భంగా వివాహానికి తప్పనిసరిగా వస్తానని హామీచ్చినట్లు ఎమ్మెల్యే బీఎల్ఆర్ తెలిపారు.
