BRS ను TRS గా మార్చాలా…?.. వద్దా…?

 BRS ను TRS గా మార్చాలా…?.. వద్దా…?

తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ పేరు మార్పుపై మళ్ళొకసారి చర్చ తెరపైకి వచ్చింది.. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ పార్టీ పేరు మార్చి చాలా తప్పు చేశాము.. బీఆర్ఎస్ గా మార్చడం వల్ల తెలంగాణతో ఉన్న పేగు బంధం తెగిపోయింది అని అయన అన్నారు…

ఈ వ్యాఖ్యలతో మరొకసారి పార్టీ పేరు మార్చాలనే అంశం తెరపైకి వచ్చింది.. అయితే నిజంగా పార్టీ పేరు మార్చడం వల్ల చాలా నష్టం జరిగిందా…?.. తెలంగాణ ప్రజలు అందుకే అధికారాన్ని దూరం చేశారా…? ఎంపీ ఎన్నికల్లో అందుకే ఒక్క సీటు కూడా ఇవ్వలేదా..?.. రానున్న రోజుల్లో పార్టీకి భవిష్యత్తు ఉండదా..?. తదితర అంశాలపై ఇప్పుడు ఓ విశ్లేషణ చూద్దాం..!

పార్టీ పేరును బట్టి లేదా ఆ పార్టీ పేరులో  ప్రాంతం పేరు ఉందనో ప్రజలు ఆ పార్టీకి పట్టం కట్టరు.అధికారంలోకి వస్తే తమకు ఏమి చేస్తారు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందా అనే అంశాలు ఆధారంగా ఓట్లు వేసి పట్టం కడతారు . తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పడిన టీఆర్ఎస్ ను పద్నాలుగు ఏండ్లు పాటు ఆదరించింది అరవై ఏండ్ల తమ కలను నెరవేరుస్తుంది.. ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చిపెడుతుంది అని.. అందుకే పదనాలుగేండ్ల ఉద్యమంలో జరిగిన ప్రతి ఎన్నికలు.. ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించి తెలంగాణ వాదాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు.. ఆ తర్వాత తెలంగాణ తెచ్చిన పార్టీ అని ఒకసారి.. తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించింది అని రెండో సారి గెలిపించారు ప్రజలు.. అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక లోక్ సభ ఎన్నికల్లో కేవలం బీఆర్ఎస్ గా ఉండటం వల్లనే తెలంగాణ ప్రజలు పార్టీని ఓన్ గా చేసుకోలేకపోయారు..అందుకే అధికారాన్ని దూరం చేయడమే కాదు ఏకంగా లోక్ సభ ఎన్నికల్లో జీరోకి పరిమితం చేశారు అని వాదిస్తున్నారు కొంతమంది.

వాళ్ళ వాదనే నిజం అనుకుంటే ముప్పై తొమ్మిది స్థానాల్లో 37.35%ఓట్ల షేరింగ్ తో ప్రజలు గెలిపించేవారు కాదు. అయిన అధికార కాంగ్రెస్ పార్టీకి పడ్డ ఓట్ల షేరింగ్ కేవలం 39.40%.. అంటే కేవలం 2%ఓట్ల తేడాతో అధికారం కోల్పోయింది అన్నమాట… ఉన్నమాట.. అయితే ఎమ్మెల్యే ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యేలపై వ్యతిరేకతతో చాలా చోట్లా ఎమ్మెల్యేలు ఓడిపోయారు.. కొంతమంది ఎమ్మెల్యేలను మారిస్తే అధికారం పక్కా అని పలు సర్వేలు… నివేదికలు వచ్చిన కానీ కేసీఆర్ అతివిశ్వసంతో ఎన్నికలకు వెళ్లారు.. మార్చిన పదిహేను చోట్ల తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు.. అంటే సక్సెస్ రేట్ ఎక్కువగానే ఉంది.. కేవలం ఎమ్మెల్యేలను మార్చకపోవడం…. క్షేత్రస్తాయి లో వారిపై ఉన్న వ్యతిరేకత తప్పా పార్టీ పేరు మార్చడం వల్ల కాదు అనేది ఇక్కడ క్లియర్ కట్..

ఇక ఎంపీ ఎన్నికల విషయానికి వస్తే ఈ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల సరళి చూస్తే జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్ బీజేపీ నీకో నియోజకవర్గం నాకో నియోజకవర్గం అంటూ మద్ధతు ఇచ్చుకున్నట్లు అర్ధమవుతుంది.. అధికాకుండా లోక్ సభ ఎన్నికలంటే ఎప్పుడైనా ఎక్కడైన కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీలను బట్టి ఇక్కడ ఓటర్లు ఓట్లు వేస్తారు.. కేంద్రంలో బీజేపీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని పలు సర్వేలు తెల్చేయాడంతో కాంగ్రెస్ కు బీజేపీ కి ప్రజలు పట్టం కట్టారు అని అర్ధమవుతుంది..చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి నా గెలుపు కోసం రేవంత్ రెడ్డి డమ్మీ అభ్యర్థిని నిలబెట్టారు అని వ్యాఖ్యానించిన సంగతి కూడా తెల్సిందే.. అయితే ఈ వ్యాఖ్యలను బట్టి కూడా కాంగ్రెస్ బీజేపీ ఎంతగా లోక్ సభ ఎన్నికల్లో లోపాయికారిగా సహకరించుకున్నాయని తేటతెల్లంగా అర్ధమవుతుంది..

అంతేకాకుండా కాంగ్రెస్ బలంగా ఉన్న చోట బీజేపీ… బీజేపీ బలంగా ఉన్న చోట కాంగ్రెస్ తమ పార్టీ తరపున బలహీనమైన అభ్యర్థిని నిలబెట్టిన విషయం కూడా ఆలోచిస్తే అర్ధమవుతుందని విశ్లేషకులు వ్యాఖ్యనిస్తున్నారు.. ఊదాహరణకు మల్కాజిగిరిలో బీజేపీ తరపున ఈటల రాజేందర్ ఉంటే కాంగ్రెస్ తరపున పట్నం సునీతారెడ్డిని , చేవెళ్ల లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఉంటే బీఆర్ఎస్ నుండి వచ్చిన రంజిత్ రెడ్డిని , మెదక్ లో బీజేపీ నుండి రఘునందన్ ఉంటే నీలం మధు ముదిరాజుని ,కరీంనగర్ నుండి బండి సంజయ్ ఉంటే వెలిచాల రాజేందర్ రావు, సికింద్రాబాద్ నుండి కిషన్ రెడ్డి ఉంటే బీఆర్ఎస్ నుండి వచ్చిన దానం నాగేందర్ ను నిలబెట్టి బీజేపీ గెలుపుకు సహకరించిందనే వాదనలు బాగా చక్కర్లు కొట్టాయి.. ఇవన్నీ పరిశీలిస్తే పార్టీ పేరు మార్చినంత మాత్రాన ప్రజలు బీఆర్ఎస్ ను పక్కన పెట్టినట్లు కాదని క్లియర్ కట్.. అయితే చాలా చోట్ల డిపాజిట్లు కూడా రాలేదు కదా అని వాదనలు కూడా తెరపైకి వచ్చాయి.. అయితే దానికి కారణాలు అక్కడఉన్న లోకల్ నాయకత్వం సరిగ్గా పని చేయకపోవడం… ఇటువైపు ఉండి అటు కాంగ్రెస్ బీజేపీ లకు పని చేయడం ఇలా రకరకాల కారణాలు ఉన్నాయని కేసీఆర్ నిర్వహించిన సమీక్ష సమావేశాల్లో క్యాడర్ నివేదించిన నివేదికలు అని కూడా తెలుస్తుంది.. కావునా పార్టీ పేరు మార్చినంత మాత్రాన తెలంగాణ ప్రజలు పక్కన పెట్టలేదని క్లియర్ కట్ అన్నట్లు … సో పార్టీ పేరు మార్చాలని చూడకుండా ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి.  పార్టీ పునర్నిర్మాణం ఎలా చేయాలనే తదితర అంశాలు గురించి ఆలోచిస్తే ఇకనైనా ఉత్తమం…

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *