HCU ఎఫెక్ట్ -సీనియర్ ఐఏఎస్ అధికారిణి రాజీనామా..!

RMPs and PMPs should not use the word “doctor”.
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసిన తాజా బర్నింగ్ అంశం హెచ్ సీయూ భూముల వివాదం. ఈ వివాదం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు చివరికి ఈ ఆంశంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అఖరికీ ప్రభుత్వంపై అటు సీఎస్ పై మొట్టికాయలు వేసి మరి ఈ వివాదాన్ని తాత్కాలికంగా సర్దుమణిగేలా చేసింది. అయితే ఈ అంశాన్ని సరిగా డీల్ చేయలేదు. దీని వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది.
అధికారపార్టీ కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది అనే నెపంతో సీనియర్ అధికారైన ఐఏఎస్ మహిళా అధికారిణీ పై ప్రభుత్వ పెద్దలు సీరియస్ అయ్యారు అంట. దీంతో మనస్థాపం చెందిన సదరు ఐఏఎస్ అధికారిణి ప్రస్తుతం ఉన్న తన పదవికి రాజీనామా చేయనున్నట్లు డా. బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయ మీడియా గ్రూపులో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఎలాగూ తాను ఈ నెల ఇరవై ఏడో తారీఖున తన పదవి కాలం ముగియనుండటంతో ప్రస్తుత పదవి కాలం పూర్తి చేసుకునే సమయానికి మంచి పేరు ఉండాలని నేపంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తన సత్తాతో మంచి పేరు తెచ్చుకున్న ఆ అధికారిణి రేవంత్ రెడ్డి అనుభవరాహిత్య నిర్ణయాలతో తనకు కూడా చెడ్డ పేరు వస్తుంది.
కేరీర్ చరమాంకంలో ఆ ముద్ర తనకెందుకని చాలా ఆలస్యంగా గ్రహించినట్లు ఉన్నారని సచివాలయంలో గుసగుసలాడుకుంటున్నారు. ఏది ఏమైన ప్రభుత్వంలో ఏదైన మంచి జరిగితే ఆ ప్రభుత్వానికి క్రెడిట్.. చెడు జరిగితే మాత్రం అధికారులకు ఆ క్రెడిట్ ఇవ్వడం ఎప్పటి నుండో ఉంది కదా అని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. పాపం కాంగ్రెస్ పార్టీ ప్రజావ్యతిరేకత నిర్ణయాలకు ఈమె బలైందని సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.
