ఫిరాయింపులపై హైకోర్టు తీర్పు- ఎమ్మెల్యేలల్లో వణుకు

mla disqualification brs
బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహారి, తెల్లం వెంకట్రావు లపై అనర్హత వేటు చర్యలు చేపట్టాలి.. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఎప్పుడు నోటీసులు ఇస్తారు.. ఎప్పుడు వారి వాదనలు వింటారు. ఎప్పుడు అనర్హత వేటు వేస్తారు ఇలా పలు అంశాలకు సంబంధించి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి.. నాలుగు వారాల్లో అనర్హత వేటుపై స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శికి తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. అయితే ఇక్కడ టెక్నిక్ ఫరంగా చూస్తే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు పడటం ఖాయం అని తెలుస్తుంది. ఒకవేళ దానం నాగేందర్ పై అనర్హత వేటు వేస్తే పార్టీ మారిన మిగతా ఇద్దరూ ఎమ్మెల్యేలు కడియం శ్రీహారి, తెల్లం వెంకట్రావు లపై కూడా వేయాలి.
వీళ్ల ముగ్గురిపై వేస్తే పార్టీ మారిన మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్,అరికెల పూడి గాంధీ, బండ్ల కృష్ణమోహాన్ రెడ్డి, డా. సంజయ్ కుమార్,పోచారం శ్రీనివాస్ రెడ్డి,కాలే యాదయ్య లపై కూడా చర్యలు తీసుకోవాల్సిందే. తాము పార్టీ మారినట్లు ఎక్కడ కూడా సాంకేతక ఫరంగా లేదు . కాబట్టి తమపై ఎలా అనర్హత వేటు వేస్తారు అని ఫిరాయింపు ఎమ్మెల్యేలు వారించిన కానీ వినే పరిస్థితి లేదు . ఎందుకంటే సాక్షాత్తు దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టే పార్టీ ఫిరాయింపులపై స్ట్రిక్ట్ లీ తీర్పునిచ్చింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలలల్లోపు చర్యలు తీసుకోవాల్సిందే. లేకపోతే సుమోటగా కేసును టేకప్ చేసి మేము అనర్హత వేటు వేస్తాము అని తేల్చి చెప్పింది.
ఈ రోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు సారాంశం ఇదే. దానం నాగేందర్ ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగారు. బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలుపొంది వేరే పార్టీలో చేరడమే కాకుండా ఆ పార్టీ గుర్తుపై ఎంపీగా బరిలోకి దిగారు . దీంతో దానం నాగేందర్ టెక్నికల్ గా పార్టీ మారారు. ఫిరాయింపుల చట్టం వర్తిస్తుందని చెప్పకనే చెప్పారు ఈ అంశం ఆధారంగా దానం నాగేందర్ పై చర్యలు తీసుకోవడం ఖాయం. ఆ తర్వాత సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మిగతా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారి మూడు నెలలు దాటుతుంది. కావున ఫిరాయింపుల చట్టం కింద పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం స్పీకర్ కు ప్రస్తుత పరిస్థితుల్లో ఖాయమైంది. ఇప్పుడు స్పీకర్ అనర్హత వేటు వేయకపోతే ఆ వేటు ఏదో హైకోర్టు వేస్తుంది. హైకోర్టు వేయకపోతే సుప్రీం కోర్టు వేయడం ఖాయం .తాజా హైకోర్టు తీర్పుతో ఫిరాయింపు ఎమ్మెల్యేలల్లో వణుకు మొదలయిందని టాక్. అందుకే పార్టీ మారిన కడియం శ్రీహారి,గాంధీ ,పోచారం లాంటి వారు మీడియా ముందుకు వచ్చి తమ వాదోపవాదనలు చేస్తున్నారు.